: నేను లాభం పొందాను: 'పనామా పేపర్స్' నిజమేనన్న బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన


విదేశాల్లో ఉన్న ఓ కంపెనీ నుంచి తాను లాభం పొందానని 'పనామా పేపర్స్'లో బహిర్గతమైన సమాచారం నిజమేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సంచలన ప్రకటన చేశారు. అయితే, పెట్టుబడులు తాను పెట్టలేదని తెలిపారు. బహమాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ట్రస్టులో తన తండ్రి పెట్టుబడులు పెట్టగా, తాను ఆ వాటాలను 2010లో విక్రయించానని, ఈ లావాదేవీ ద్వారా 30 వేల పౌండ్లను తాను పొందానని తెలిపారు. రెండు రోజుల క్రితం వెల్లడైన పనామా పేపర్స్ లీకేజీల్లో డేవిడ్ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ పెరుగుతున్న వేళ, ఐటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ కామెరాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. "బ్లెయిర్ మోర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ లో 5 వేల యూనిట్లు నా వద్ద ఉన్నాయి. నేను ప్రధానిగా ఎన్నిక కానున్న వేళ, విమర్శలకు తావివ్వరాదని భావించి వాటిని విక్రయించాను. 1997లో వాటా కొనగా, వచ్చిన డివిడెండ్లపై ఆదాయపు పన్ను చెల్లించాను" అని తెలిపారు.

  • Loading...

More Telugu News