: బాంబులు పెట్టి దర్జాగా వెళ్లిపోతున్న 'మ్యాన్ ఇన్ హ్యాట్'!


'మ్యాన్ ఇన్ హ్యాట్'... దాదాపు రెండు వారాల నుంచి ఇతన్ని అరెస్ట్ చేసేందుకు బెల్జియం పోలీసులు జల్లెడ పడుతున్నారు. గత నెల 22న బెల్జియం ఎయిర్ పోర్టులో బాంబులు పెట్టడానికి వచ్చిన ముగ్గురిలో ఇతను కూడా ఒకరు. ఆ దుర్ఘటనలో 32 మంది చనిపోగా, బాంబులు అమర్చిన అనంతరం దర్జాగా వెళ్లిపోతున్న ఈ 'టోపీవాలా' చిత్రాలు ఎయిర్ పోర్టు బయటున్న సీసీ కెమెరాల నుంచి భద్రతా దళాలు సేకరించాయి. బాంబులు ఉదయం 7:58కి పేలగా అదే రోజు ఉదయం 9:50 గంటల ప్రాంతంలో సెంట్రల్ బ్రసెల్స్ లో నడిచి వెళుతున్న అతని చిత్రాలను బ్రెజిల్ పోలీసులు విడుదల చేశారు. ఆపై అతని జాడ ఎక్కడా నమోదు కాలేదని తెలుస్తోంది. ఈ రెండు గంటల వ్యవధిలో ఒక చోట ఫోన్ మాట్లాడుతూ, మరో చోట వేసుకున్న జాకెట్ విప్పుతూ అతను సీసీ కెమెరాల్లో చిక్కాడు. ఇతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఇప్పటికే కోరారు.

  • Loading...

More Telugu News