: 750 ఆహ్వానాలు...1,500 మందికి ఎంట్రీ...2 వేల మందికి భోజనాలు: భారీగా నారా దేవాన్ష్ బర్త్ డే విందు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ తొలి జన్మదినం సందర్భంగా విజయవాడలో నేడు ఏర్పాటవుతున్న విందు... భారీ విందుగానే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆహ్వానాలు పంపిన చంద్రబాబు ఏర్పాట్లన్నింటినీ పక్కాగా చేయిస్తున్నారు. ఈ విందుకు ఆహ్వానించేందుకు చంద్రబాబు ఏకంగా 750 ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఇప్పటికే ఈ ఆహ్వాన పత్రికలు నిర్దేశిత ఆహ్వానితులకు చేరిపోయాయి. ఈ ఆహ్వానాలతో పాటు సప్లిమెంటరీగా మరో పత్రికను కూడా అందజేశారట. ఆహ్వానితులతో పాటు వారి భార్య/భర్త, లేక ఓ సహాయకుడిని లోపలికి అనుమతిస్తారు. ఆహ్వానాల వెంటే విందు జరిగే ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లోకి ఎంట్రీ కోసం ఆహ్వానితులకు స్మార్ట్ కార్డులను కూడా అందజేశారు. ఈ స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తేనే లోపలికి ఎంట్రీ లభిస్తుందట. 750 ఆహ్వానాలతో మొత్తం 1,500 మంది ఈ విందుకు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక అక్కడ విందును మాత్రం 2 వేల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విందు విజయవాడలోనే జరుగుతున్నా, ఆహార పదార్థాలను మాత్రం హైదరాబాదుకు చెందిన తాజ్ హోటల్ అందజేయనుంది. ఈ మేరకు చంద్రబాబు కుటుంబం మెనూ బాధ్యతలను తాజ్ హోటల్ కు అప్పగించింది.

  • Loading...

More Telugu News