: టీడీపీలోకి నేడు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు... చంద్రబాబు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కనున్న వరుపుల, సునీల్!
గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు నేతలు నేడు టీడీపీలో చేరనున్నారు. ఉగాది పర్వదినాన్ని శుభసూచకంగా భావించిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్... నేడు విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన ఈ ఇద్దరు నేతలు... తాము వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి చేరికతో వైసీపీ టికెట్ పై విజయం సాధించి... టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరనుంది.