: ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యను తట్టుకోలేక అభిమాని ఆత్మహత్య
హిందీ బుల్లితెరపై ఆనందిగా అలరించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన అభిమాని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. రాయ్ పూర్ లో నివసించే మధు మహానంద్ (22) ప్రత్యూషకు సంబంధించిన వార్తలను టీవీల్లో చూసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఇంట్లో పెద్దలెవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అది చూసిన ఆమె రెండేళ్ల కుమారుడు పెద్దగా ఏడవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కాగా, ప్రత్యూష తతంగం టీవీల్లో ప్రసారమవుతున్నప్పుడు ఉరివేసుకుంటే ఎలా ఉంటుందని తన భార్య తనను ప్రశ్నించిందని, ఇంత పని చేసుకుంటుందని ఊహించలేదని మధు భర్త నకుల్ మహానంద్ తెలిపారు.