: తమిళులైనా తెలుగు సంప్రదాయాన్ని ఆదరించడం ముదావహం: కేసీఆర్
దుర్ముఖి నామ సంవత్సరం అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాది పేరుకి దుర్ముఖి అయినంతమాత్రాన జరిగే అనర్థాలు ఏమీ లేవని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పండితులు చెప్పడం హర్షణీయమని అన్నారు. గవర్నర్ నరసింహన్ స్వతహాగా తమిళులైనప్పటికీ తెలుగు సంప్రదాయాన్ని ఆదరించడం ముదావహమని ఆయన ప్రశంసించారు. ఉగాది తెలుగు ప్రజలకు ఎంతో విశిష్టమైన పండుగ అని, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులను గవర్నర్ సత్కరించారు.