: ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్...నెంబర్ వన్ అర్జెంటీనా
అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఫిఫా) వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జెంటీనా సత్తా చాటింది. గత కొన్ని నెలలుగా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 'నెంబర్ టూ'గా కొనసాగుతున్న అర్జెంటీనా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మూడు మ్యాచ్ లలో విజయం సాధించడంతో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. దీంతో ఇంతవరకు నెంబర్ వన్ గా ఉన్న బెల్జియం నెంబర్ టూ స్థానానికి పడిపోయింది. ఐదో ర్యాంకులో కొనసాగిన చిలీ రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. నాలుగు ర్యాంకులు ఎగబాకిన కొలంబియా నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఐదో ర్యాంకులో జర్మనీ, 6వ ర్యాంకులో రెండు స్థానాలు దిగజారిన స్పెయిన్, 7వ ర్యాంకులో బ్రెజిల్, 8వ ర్యాంకులో పోర్చుగల్, 10వ ర్యాంకులో ఇంగ్లండ్ దేశాలు ఉండగా, భారత్ రెండు ర్యాంకులు దిగజారి 162వ ర్యాంకులో నిలిచింది.