: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని చంద్రబాబు విలాసాలకు ఖర్చు చేస్తున్నారు: మాజీ మంత్రి శైలజానాథ్
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అందకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద విడుదల చేసిన నిధులను చంద్రబాబునాయుడు విలాసాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విదేశాల టూర్లకు ఖర్చులను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.