: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన గిల్ క్రిస్ట్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్ పగ్గాలు తీసుకున్న తరువాత జట్టు ఆటలో వేగం పెరిగిందని అన్నాడు. కోహ్లీలో నాయకత్వ లక్షణాలు అమోఘమని కితాబు ఇచ్చాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ ముద్ర గొప్పదని అభినందించాడు. టీమిండియా విజయాల్లో కోహ్లీ పాత్ర అద్భుతమని కొనియాడాడు. ధోనీ ఇంకా ఆడుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో కోహ్లీని కెప్టెన్ చేయాలని తాను చెప్పలేనని ఆయన స్పష్టం చేశాడు. అది సరికాదని కూడా అన్నాడు.

  • Loading...

More Telugu News