: టీ20 చిచ్చు... త‌మ‌ను వేరే కళాశాలలకు బదిలీ చేయాలని కాశ్మీర్ 'నిట్' స్థానికేతర విద్యార్థుల డిమాండ్


టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ ఓటమితో శ్రీనగర్ నిట్లో ప్రారంభ‌మైన‌ కాశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ.. త‌మ‌ను వేరే క‌ళాశాల‌ల‌కు బ‌దిలీ చేయాలని స్థానికేత‌ర‌ విద్యార్థులు డిమాండ్ చేసే వ‌ర‌కు వ‌చ్చేసింది. సెమీస్‌లో టీమిండియా ఓట‌మి చెందిన వెంట‌నే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేసిన విష‌యం తెలిసిందే. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇరు గ్రూపుల మ‌ధ్య కొన్ని రోజులుగా యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. ఈరోజు కొంత మంది స్థానికేత‌ర‌ విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఆవరణలో ఆందోళ‌న‌కు దిగారు. తమని అక్కడి నుంచి వేరే కళాశాలలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదంతో వారు వ‌ర్సిటీలో ర్యాలీ చేశారని సంబంధిత‌ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News