: పవన్ దయవల్లే నేను కోలుకున్నా: క్యాన్సర్ ను జయించిన బాలిక శ్రీజ


తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు తన వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ కు చాలా కృతఙ్ఞతలు అని క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన బాలిక శ్రీజ పేర్కొంది. ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శ్రీజ, తన తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మీడియా తో మాట్లాడింది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని, రేపు విడుదల కానున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని చూస్తానని చెప్పింది. అంతకుముందు, శ్రీజ తండ్రి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దయవల్లే తన కూతురు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిందని పేర్కొన్నారు. తమ బిడ్డ ప్రాణాలు నిలిచేలా చేసిన పవన్ కల్యాణ్ తమకు దేవుడితో సమానమని, ఆ దేవుడే ఈ దేవుడి రూపంలో వచ్చాడన్నారు. అదేవిధంగా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన వైద్యుడి లాంటి పవన్ కల్యాణ్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా వారికి తమ కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, గతంలో క్యాన్సర్ బారిన పడిన శ్రీజ, పవన్ కల్యాణ్ ని చూడాలని కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పవన్ కల్యాణ్ నాడు పరామర్శించి, ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు.

  • Loading...

More Telugu News