: మ‌లింగ ఆట తీరును ఐపీఎల్‌-9లో చూడొచ్చా..?


మోకాలి గాయంతో శ్రీ‌లంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ఇటీవ‌ల జ‌రిగిన‌ టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌ నుంచి తప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే గాయం నుంచి మలింగ పూర్తిగా కోలుకోలేని కార‌ణంగా ఈ నెల 8న ప్రారంభం కానున్న‌ ఐపీఎల్‌-9 లోనూ.. మ‌లింగ పాల్గొనే అవ‌కాశాలు త‌క్కువేన‌ని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున మలింగ ఆడ‌నున్నాడు. అయితే, వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ క్యాంప్‌లో మ‌లింగ క‌నిపించ‌లేదు. దీంతో మలింగ ఐపీఎల్‌-9లో పాల్గొన‌డంపై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈ నెల 9న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో కొత్త జట్టు పూణె సూపర్‌జెయింట్స్‌ తలపడనుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. అయితే ప్రారంభ మ్యాచుల్లో మాత్రమే మ‌లింగ పాల్గొన‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News