: పవన్ కల్యాణ్ గెటప్ మారింది!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెటప్ మారింది. మీసాలు తీసేసి, నీట్ గా గడ్డం చేసుకుని, చిన్న క్రాఫ్ తో కనిపిస్తున్న ఆయన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇటీవల పవన్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, పవన్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రేపు విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రిలీజ్ రోజునే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, పవన్ కల్యాణ్ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో అయితే, రిలీజ్ రోజే ఈ చిత్రాన్ని తమ థియేటర్లలో చూసేవారికి ఆయా యాజమాన్యాలు ఉచితంగా కూల్ డ్రింక్ లు ఇస్తామంటున్నాయట.