: విజయ్ మాల్యా రూ. 4 వేల కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన బ్యాంకుల కన్సార్టియం


బ్యాంకులకు రూ. 4 వేల కోట్లను చెల్లిస్తానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. ఆయన చేసిన ఆఫర్ ను బ్యాంకులు తిరస్కరిస్తున్నట్టు కోర్టుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వెల్లడించింది. తమకు ఆయన నుంచి రూ. 9 వేల కోట్లు రావాల్సి వుందని, రూ. 4 వేల కోట్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని కన్సార్టియం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, బ్యాంకుల తిరస్కరణపై స్పందించి, కొత్త ప్రతిపాదనలతో వచ్చేందుకు రెండు వారాల సమయం కావాలని కింగ్ ఫిషర్ యాజమాన్యం కోరింది. కేసు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News