: ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ కు ఎదురుదెబ్బ... తప్పుకున్న న్యాయవాది!


దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించిన బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ హత్యకేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ రాజ్ సింగ్, తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోర్టుకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో, కేసును తాను వాదించబోనంటూ న్యాయవాది నీరజ్ గుప్తా స్పష్టం చేశారు. ఈ కేసులో రాహుల్ నిజాలను దాస్తున్నాడని, తనకు అన్ని విషయాలనూ చెప్పడం లేదని ఆరోపించారు. కాగా, రాహుల్ పై ఐపీసీ సెక్షన్లు 306, 323, 504, 506 కింద బంగూర్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ తమ కూతురిని కొట్టాడని ప్రత్యూష తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును పెట్టిన పోలీసులు ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. మరోపక్క రాహుల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పై నేడు విచారణ జరుగనుంది.

  • Loading...

More Telugu News