: ‘చంద్రు’లూ ఉగాది వేడుకలకు రండి... తెలుగు రాష్ట్రాల సీఎంలకు గవర్నర్ ఆహ్వానం


శ్రీదుర్ముఖి నామ ఉగాది వేడుకలు నేడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఘనంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరుకావాలంటూ నరసింహన్... ‘ఇద్దరు చంద్రులు’గా ప్రాచుర్యం పొందిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు ఆహ్వానం పంపారు. గవర్నర్ ఆహ్వానం మన్నించి ‘ఇద్దరు చంద్రులు’ ఈ వేడుకలకు హాజరవుతారో, లేదో చూడాలి. నేటి సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల కేబినెట్ మంత్రులకు కూడా గవర్నర్ ఆహ్వానాలు పంపారు.

  • Loading...

More Telugu News