: ఏపీ రాజధానికి వచ్చే ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పనిచేస్తే చాలు: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఐదురోజులు పనిచేస్తే చాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజులే పనిదినాలుగా పరిగణిస్తామని, ఈ విధానం ఏడాది పాటు కొనసాగిస్తామని చెప్పారు. నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, నాలుగు జిల్లా కేంద్రాల్లో కాపు భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు నారాయణ పేర్కొన్నారు.