: పార్టీ ఫిరాయింపు అంటే ఎంగిలి మెతుకులు తినడం లాంటిది: మోహన్ బాబు
చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. తిరుపతిలో మోహన్ బాబు మాట్లాడుతూ, ఇప్పుడున్న పార్టీలోనే చేరుతానని తెలిపారు. పార్టీ ఫిరాయింపు అంటే ఎంగిలి మెతుకులు తినడం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గతంలో మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు వైెఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఆయన బంధువు అవుతారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతారా? లేక వైఎస్సార్సీపీలో చేరుతారా? అన్న ఆసక్తితో ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.