: ప్రేమకు సరికొత్త నిర్వచనం...ప్రేమించుకున్న 70 ఏళ్లకు వివాహం!


'ప్రేమ గొప్పది' అని కవులు చెబుతుంటారు...బ్రిటన్ కు చెందిన రాయ్ వికర్ మాంట్ (90), నోరా జాక్సన్(90) కధ చదివితే ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే...రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న బ్రిటన్ సైనికుడు రాయ్ వికర్ మాంట్ 1940లో నోరా జాక్సన్ ను కలిశాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 1946లో వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకుందామని భావించారు. ఇంతలో యుద్ధం కారణంగా రాయ్ అనారోగ్యం పాలయ్యాడు. తరువాత అనుకోని పరిస్థితుల్లో వారిద్దరూ విడిపోయారు. ఇద్దరూ ఎవరికి వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడిపోయారు. జీవితం ఎంత సాఫీగా సాగినా రాయ్ మాత్రం తన ప్రియురాలిని మర్చిపోలేదు. ఈ క్రమంలో రాయ్ భార్య మరణించడంతో ఒంటరి అయ్యాడు. స్థానిక రేడియో సహాయంతో తన ప్రేయసి గురించి తెలుసుకున్నాడు. విచిత్రంగా, తనకు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఆమె ఉందని తెలియడంతో వెళ్లి కలిశాడు. మరో విచిత్రం... ఆమె భర్త కూడా మరణించి, ఆమె కూడా తనలా ఒంటరిగా ఉందని గుర్తించాడు. దీంతో తన 90వ ఏట గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమకు పూర్తిరూపమిస్తూ పెళ్లి ప్రపోజల్ చేశాడు. దీంతో ఆమె కూడా అంగీకరించడంతో పాత ప్రేమికులు త్వరలో దంపతులు అవుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. చివరికి ప్రేమే గెలిచింది!

  • Loading...

More Telugu News