: సభాహక్కుల సంఘం ఎదుట హాజరైన రోజా... విచారణ ప్రారంభం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. సస్పెన్షన్ కు సంబంధించిన వ్యవహారంలో ఆమె సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చేసిన ఫిర్యాదులపై రోజా వివరణ ఇవ్వనున్నారు. సభా హక్కుల కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని ఆమె లేఖ రాశారు. తాజాగా ఆమెకు మరో అవకాశం ఇస్తూ.. సభా హక్కుల కమిటీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సభా హక్కుల కమిటీ ముందు విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసిన రోజా.. కమిటీ ఎదుట హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన విచారణ జరుగుతోంది. రోజా వాదన సరైందని కమిటీ భావిస్తే ఆమెపై విధించిన సస్పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది.