: మంత్రి నారాయణ రూ.10 కోట్ల నిధులిస్తామన్నారు: గూడూరు ఎమ్మెల్యే సునీల్
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరితే... తన నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారని నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాశం అనిల్ కుమార్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సునీల్ కుమార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను టీడీపీలో చేరితే మంత్రి నారాయణ తన శాఖ నుంచి గూడూరుకు రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారనన్నారు. రూ.10 కోట్లతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. ఈ నెల 8న మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని సునీల్ ప్రకటించారు. ఆ తర్వాత సరైన సమయం చూసుకుని త్వరలోనే గూడూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని, ఈ సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన చెప్పారు.