: పనామా జాబితాలో తెలుగువారు... నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు
నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే మన తెలుగువారేమన్నా తక్కువ తిన్నారా.. పనామా పత్రాల్లో చూపిన నల్లకుబేరుల్లో తెలుగువారూ ఉన్నారట. ఈ జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొంది. నల్ల ధనాన్ని విదేశాల్లో దాచేస్తున్న వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, ఓలన్ భాస్కర్ రావు, భావనాశి జయకుమార్ పేర్లు ఉన్నాయి. వీరిలో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ 2011లో నాలుగు సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారట. నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీలకు భావనాశి జయకుమార్ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఎక్కువగా యూకేలో గడుపుతున్న ఓలన్ భాస్కర్ రావు సుమారు ఏడు సంస్థలకు ఎండీగా ఉన్నారు. గొప్ప బిజినెస్మేన్లుగా చెప్పుకునే కుబేరుల గుండెల్లో పనామా రైళ్లు పరిగెత్తిస్తోంది.