: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు... ప్రతిఘటించిన మహిళ... 25 రోజుల పసికందు మృతి


తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నేరేడ్ మెట్ లో చైన్ స్నాచర్లు దాడి చేయగా, అభంశుభం ఎరుగని 25 రోజుల పసికందు మృతి చెందింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన బిడ్డను చేతుల్లో పెట్టుకుని నడిచి వెళుతుండగా, చైన్ స్నాచర్లు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకు వెళ్లేందుకు యత్నించారు. గొలుసు వెంటనే తెగకపోవడంతో, బాధితురాలు కేకలు పెడుతూ, ప్రతిఘటించింది. పెనుగులాటలో చేతిలోని బిడ్డ కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News