: నిన్న పారిస్, బ్రస్సెల్స్... రేపు లండన్, రోమ్!: 'ఐఎస్ఐఎస్' వీడియో హెచ్చరిక


పారిస్, బెల్జియంలలో ఆత్మాహుతి దాడులతో కలకలం రేపిన ఐఎస్ఐఎస్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో బ్రిటన్ పార్లమెంటు, ఈఫిల్ టవర్ ను కూల్చేస్తున్న యానిమేటెడ్ దృశ్యాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతూ 'నిన్న పారిస్, బ్రస్సెల్స్...రేపు లండన్, బెర్లిన్, రోమ్, ఏ దేశమైనా కావచ్చు' అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తమ సైనికులు ఇస్లామేతరులను చంపేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని ఆ వ్యక్తి తెలిపాడు. పారిస్ ఘటనలో 130 మందిని బలిగొన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బ్రస్సెల్స్ దాడుల్లో 32 మందిని బలిగొన్నారు. వందలాది మందిని క్షతగాత్రులను చేశారు. తాజా హెచ్చరికలతో ప్రపంచం మొత్తం మరోసారి అప్రమత్తమయ్యింది.

  • Loading...

More Telugu News