: వెంకయ్యనాయుడిని కలిసిన ఎమ్మెల్యే నాగం
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఈ రోజు కలుసుకున్నారు. ఈ సమయంలో వీరిద్ధరూ పలు విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. నాగం బీజేపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను నిన్న ఢిల్లీలో నాగం కలుసుకున్న సంగతి తెలిసిందే.