: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో మరో ప్రత్యేక ఆకర్షణ.. ఆడి పాడనున్న రాక్‌స్టార్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ వేడుకలు ఆకాశాన్నంటేలా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 8న జరగనున్న ఐపీఎల్-9 ఆరంభ వేడుకల్లో హాలీవుడ్ రాక్స్టార్లు సందడి చేయనున్నారు. గాయకులు క్రిస్ బ్రౌన్, మేజర్ లేజర్ ఈ ప్రారంభ వేడుకల్లో ఆడి పాడనున్నారు. ఇండియాలో మొదటిసారిగా తాము ఆడి పాడి అలరించనున్నట్లు బ్రౌన్ టీమ్ తెలిపింది. దీనికోసం తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 9న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో కొత్త జట్టు పూణె సూపర్‌జెయింట్స్ తలపడనుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.