: క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీ, 8 జీబీ స్టోరేజ్, 5 అంగుళాల ఫోన్ రూ. 3,599


రూ. 5 వేల కన్నా తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్ క్యాటగిరీలో మరో ఆకర్షణీయమైన ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ-కామర్స్ సంస్థ షాప్ క్లూస్ ద్వారా లభ్యమయ్యే ఈ 'ఓపులెంట్' స్మార్ట్ ఫోన్ ధర రూ. 3,599. రీచ్ మొబైల్ పరిచయం చేస్తున్న ఈ ఫోన్ లో 5 అంగుళాల హై డెఫినిషన్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 5/2 ఎంపీ కెమెరాలతో పాటు 3జీ సదుపాయమూ ఉంటుందని రీచ్ మొబైల్ వైస్ ప్రెసిడెంట్ అనిస్ రెహమాన్ వెల్లడించారు. దీంతో పాటు రూ. 2,999 ధరలో కోజంట్ పేరిట మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఓపులెంట్ క్సోలో వన్ హెచ్డీ ఫోన్ కు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News