: మెక్సికో తీరంలో మనిషిని పోలిన చేప!


మెక్సికో సముద్రతీరంలో మనిషిని పోలిన చేపను జాలర్లు పట్టుకున్నారు. గతంలో ఇలాంటి చేపను చూడకపోవడంతో వారు దానిని గ్రహాంతర చేపగా భావించారు. కాగా, తెలుపు, గులాబీ రంగు కలయికతో మనిషి చర్మాన్ని పోలిన చేప, అచ్చం మనిషిలా నీటి అడుగున తిరుగాడుతూ కనిపించింది. దీనిని కాబో సమీపంలోని జామీ రెన్డాన్ ఓడలో జాలరి గుర్తించాడు. దీంతో దానిని పట్టేసి, ఏలియన్ ఫిష్ గా పిలవడం ప్రారంభించారు. ఆకురాయిలా గరుకుగా ఉన్న చర్మంతో, మూడు వరుసల పళ్లతో, తలకిరువైపులా మూడు గ్రిల్స్ లాంటి రంధ్రాలతో అచ్చం మనిషిని పోలినట్టుండే ఈ చేపను చూసిన నిపుణులు ఆల్బినో స్వెల్ షార్క్ గా దీనిని గుర్తించారు. ఇది ఎవరికీ హాని చేయదని, అయితే మనిషిని కానీ, హాని చేసే ఇతర జంతువులను కానీ చూసినప్పుడు అమాంతం నీటిని కడుపులో దాచుకుని ఆకారం పెద్దగా మార్చుకుంటుందని తెలిపారు. దీనిని పట్టుకున్న రెన్డాన్ మాట్లాడుతూ, దాని కళ్లను చూసి ఆశ్చర్యపోయానని, అచ్చం మనిషి కళ్లలా ఉన్నాయని అన్నారు. తరువాత దీనిని జాగ్రత్తగా నీట్లో విడిచిపెట్టామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News