: ఏపీలో 20 వేల పోలీసు ఉద్యోగాలు: చినరాజప్ప


ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ఈ మధ్యాహ్నం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత రెండేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను 90 శాతం మేర అదుపు చేశామని తెలిపారు. అలాగే నేరాలను కూడా అదుపు చేయగలిగామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూకబ్జాలపై విచారణలు జరుగుతున్నాయని చినరాజప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని, ఇసుకను అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News