: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు.. ఆపై ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు
డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువై పోతుండడం, తద్వారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ తనఖీలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ బాపతు 31 మంది పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వీరికి శిక్షగా కోర్టు ట్రాఫిక్ విధుల్లో పాల్గొనాలని సూచించింది. దీంతో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 31 మంది కంట్రోల్ రూం సమీపంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ప్లకార్డులు పట్టుకొని విధులు నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో వాహనాలను కంట్రోల్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల్లా చేతి సిగ్నల్స్ సూచిస్తూ విధులు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.