: 'పనామా పేపర్స్' రెండో జాబితా విడుదల... లిస్టులో క్రికెటర్ అశోక్ మల్హోత్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ చైర్మన్ గౌతమ్ థాపర్


ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన 'పనామా పేపర్స్' మలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఉన్న భారతీయుల్లో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ చైర్మన్ గౌతమ్ థాపర్, మొహ్రాసన్స్ జ్యూయెలర్స్ అధినేత అశ్వనీ కుమార్ తదితరుల పేర్లున్నాయి. కాగా, విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని చెబుతూ, నిన్న విడుదలైన తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సెలబ్రిటీల పేర్లు వెల్లడి కాగా, వారిలో అత్యధికులు తమకు నల్లధనంతో సంబంధం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు పలు దేశాలు ఈ ఆరోపణలపై స్వీయ విచారణలకు ఆదేశాలు జారీ చేశాయి.

  • Loading...

More Telugu News