: నేనైతే రాముడిని కాదు!: ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ


వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సారి పంథా మార్చారు. తన శిష్యుడు, టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి ముంబైలో సందడి చేశారు. ముంబై మోడళ్లతో కలిసి గురుశిష్యులిద్దరూ సరదాగా గడిపారు. ఈ చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ... సదరు పోస్టులకు ఆసక్తికర ట్యాగ్ లైన్లు తగిలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తానైతే రాముడిని కాదని, కేవలం గోపాలుడినేనని వర్మ ట్వీటారు. రామ్... గోపాల్ కాదని, అదే సమయంలో గోపాల్... రామ్ కాదంటూ వ్యాఖ్యానించారు. ఇక తన శిష్యుడి పేరు ముంగిట ఉన్న ‘పూరి’పై కూడా ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘పూరి ముంబైలో లేడు. ముంబైనే పూరీలో ఉంది’’ అంటూ సరికొత్త తరహాలో వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News