: స్పైస్ జెట్ నుంచి హైదరాబాద్-చెన్నై మార్గంలో మరో విమానం


చెన్నై-హైదరాబాద్ మార్గంలో నాలుగో నాన్ స్టాప్ విమానాన్ని ప్రారంభించనున్నట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ పేర్కొంది. ఈ వేసవిలో చెన్నై-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ప్రతిరోజూ (శనివారం మినహా) ఈ సర్వీస్ నడుస్తుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. గత వేసవిలో 240 విమానాలు నడపగా, ప్రస్తుతం 306 విమానాలు నడపనున్నట్లు సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News