: బెంగాల్ ఎన్నికల్లో దాల్మియా కుమార్తె తరఫున గంగూలీ ప్రచారం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ పాల్గొననున్నాడు. క్రికెట్ లో గాడ్ ఫాదర్ గా పేరొందిన దివంగత జగ్ మోహన్ దాల్మియా కుమార్తె వైశాలి బాలి నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. దీంతో ఆమె తరపు ప్రచారంలో గంగూలీ పాల్గొననున్నారని వైశాలి తెలిపారు. ప్రజా జీవితంలో తన తండ్రి వారసత్వాన్ని తాను తీసుకెళ్తానని ఆమె తెలిపారు. ప్రచారం కోసం నిర్వహించనున్న ఫుట్ బాల్ మ్యాచ్ లో తన తరపున గంగూలీ ప్రచారం చేస్తారని ఆమె వెల్లడించారు. ఆమె పోటీ చేయనున్న నియోజకవర్గంలో ఏప్రిల్ 24న ఎన్నిక జరగనుంది.