: ఈ ఐదింటితో ‘గుండె’కు ఆరోగ్యం


మనం తీసుకునే ఆహారంలో ఈ ఐదింటిని కనుక చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం తగ్గించుకోవాలన్నా, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలన్నా ఈ ఐదు ఆహార పదార్థాలు తప్పని సరిగా తీసుకోవాలి. వాటిలో.. * మొలకెత్తిన గోధుమలు * చిలకడ దుంపలు * పాలకూర * బీన్స్ * ఆల్మండ్స్ (బాదం పప్పు) తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషనిస్టులు, వైద్యులు చెబుతున్నారు. పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషక విలువలు వీటిలో ఉంటాయి. పైథో న్యూట్రియాంట్స్, విటమిన్ ఏ, ఈ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.

  • Loading...

More Telugu News