: 'షేక్' చేసే వాస్తవం... షేక్స్ స్పియర్ పురుషుడు కాదు మహిళ అట!


హైస్కూలు విద్య పూర్తి చేసే ప్రతి విద్యార్థికి పరిచయం ఉన్న రచయిత విలియమ్ షేక్ స్పియర్...విలియమ్ షేక్ స్పియర్ 'పురుషుడు కాదు మహిళ' అంటూ 'షేక్ స్పియర్ డార్క్ లేడీ' అనే పుస్తకంలో ఆయన సాహిత్యం, జీవితంపై ఎన్నో పరిశోధనలు చేసిన జాన్ హడ్సన్ చెబుతున్నారు. షేక్ స్పియర్ అసలు పేరు అమేలియా బస్సానో అని ఆయన తెలిపారు. ఆమె పూర్వీకులు క్వీన్ ఎలిజబెత్-1 దగ్గర సంగీత విద్వాంసులుగా పని చేశారని ఆయన చెప్పారు. ఆమె నల్లని కురులు కలిగిన యూదు స్త్రీ అని ఆయన పేర్కొన్నారు. ఆమె లార్డ్ చాంబర్లేన్ హెన్రీ కేర్ ని వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు. నాటి ఇంగ్లిష్ ధియేటర్ కు హెన్రీ కేర్ ఇన్ఛార్జ్ గా పని చేశారని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె కుటుంబం ఇటలీ నుంచి వలస వచ్చిందని, అందుకే ఆమె నాటకాల్లో ఇటలీ సంస్కృతి కనిపిస్తుందని ఆయన తెలిపారు. 'ఒథెల్లో' నాటకంలోని అమేలీ, 'మర్చెంట్ ఆఫ్ వెనిస్' నాటకంలోని బస్సానో క్యారెక్టర్లు ఆమె పేరును ప్రతిబింబిస్తున్నాయని ఆయన వెల్లడించారు. క్రిస్టోఫర్ మార్లో అనే ప్రసిద్ధ రచయితతో ఆమె అనుబంధం కొనసాగించారని, దాని ఫలితంగా ఆమె మరణించే నాటికి గర్భవతి అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం మరణించిన షేక్ స్పియర్ ఎవరు? అనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉండగా, వాస్తవాలు తెలుసుకునేందుకు స్టాన్ ఫోర్డ్ లోని ట్రినిటి చర్చిలో ఉన్న షేక్ స్పియర్ సమాధిపై కూడా పరిశోధనలు జరిగాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా పరిశోధకులు పరిశోధించగా, 1794లోనే ఆమె పుర్రె ఆమె సమాధి నుంచి మాయం అయినట్టు గుర్తించారు. దీంతో ఆమె స్త్రీయా? లేక పురుషుడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

  • Loading...

More Telugu News