: విండీస్ బోర్డు కంటే బీసీసీఐ మమ్మల్ని బాగా చూసుకుంది: డ్వెన్ బ్రావో


వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ తమను బాగా చూసుకుందంటూ కెప్టెన్ డారెన్ సామి చేసిన వ్యాఖ్యలకు జట్టు ఇతర ఆటగాళ్లు మద్దతు పలుకుతున్నారు. చాలా కాలంగా విండీస్ బోర్డు, ఆటగాళ్లకు మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవి తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో, ప్రస్తుతం విండీస్ క్రికెట్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతుల్లో లేవని బ్రావో అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఒక్క అధికారి కూడా ఫోన్ చేసి అభినందించలేదని బ్రావో తెలిపాడు. వరల్డ్ కప్ తాము గెలవాలని బోర్డు కోరుకోలేదని బ్రావో పేర్కొన్నాడు. తమకు విండీస్ బోర్డు నుంచి సహాయ సహకారాలు లేవని బ్రావో తెలిపాడు. విండీస్ బోర్డు కంటే బీసీసీఐ తమకు చాలా సాయం చేసిందని చెప్పాడు. భారత్ లో అభిమానుల నుంచి ఆదరణ లభించిందని, విండీస్ అభిమానులు అక్కడి నుంచి రావడం సంతోషం కలిగించిందని బ్రావో చెప్పాడు.

  • Loading...

More Telugu News