: ఏలూరులో న్యాయవాది హత్య
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో న్యాయవాది పీడీఆర్ రాయల్ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాయల్ ఈరోజు మధ్యాహ్నం వన్ టౌన్ లోని ఒక దుకాణంలో ఉండగా నలుగురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ, న్యాయవాది హత్య కేసులో నలుగురు నిందితులున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.