: 18 ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన వ్యక్తితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన హాలీవుడ్ నటి
హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తితో మాట్లాడడానికే చాలామంది భయపడతారు. అలాంటిది ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి కెర్రీ కటోనా దీనికి భిన్నంగా ప్రవర్తించింది. హత్యకేసులో 18 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి, ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి చేతిలో చేయి వేసి నడుస్తూ.. అతని పెదవులతో పెదవులు కలిపి ముద్దు పెట్టింది. అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేసింది. 1994లో కారు డీలర్‌ను హత్య చేసిన కేసులో కెవిన్ లేన్ అనే వ్యక్తి 18 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన అతడితో నటి కెర్రీ కటోనా ఇలా ప్రవర్తించడం హాట్ టాపిక్‌గా మారింది. సెంట్రల్ లండన్‌లోని ఓ వేదిక వద్ద ఇది జరిగింది. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కెర్రీ గతంలోనూ పలువురితో డేటింగ్ చేసింది. అయితే తాజాగా ఇతనితో తాను డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో కెర్రీ కటోనా మండిపడింది. అతడితో తాను డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఆమె మేనేజర్ మాట్లాడుతూ... ఫొటోలకు పోజు ఇచ్చేందుకు మాత్రమే ఆమె అతనికి ముద్దు ఇస్తున్నట్టు నటించిందని వివరణ ఇచ్చాడు. ఏది ఏమైనా ఈ అమ్మది తీరే వేరు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.