: సర్వీస్ ట్యాక్స్ నూ ఎగవేసిన మాల్యా!... లిక్కర్ కింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ను వేలం వేయనున్న కేంద్రం
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... బ్యాంకులనే కాదండోయ్, కేంద్ర ప్రభుత్వానికీ షాకిచ్చారు. మాల్యా కొట్టిన దెబ్బకు కాస్తంత ఆలస్యంగా తేరుకున్న కేంద్రం... నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. వివరాల్లోకెళితే... 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా... కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్)ను ఎగవేశారు. కాస్త ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) లెక్కలు తీసింది. మాల్యా ఏకంగా రూ.535 కోట్ల సేవా పన్నును ఎగవేసినట్లు నిర్ధారించింది. ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికే మాల్యా లండన్ చెక్కేయడంతో ఆయనకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను వేలం వేసేందుకు సీబీఈసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.