: కొడుకే కాదు... తండ్రి కూడా వేధించాడు!: కేరళ ముఖ్యమంత్రిపై సరితా నాయర్ సంచలన లేఖ
తన సంచలన ఆరోపణలతో కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన సరితా నాయర్ గతంలో రాసిన ఓ లేఖ వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. గతంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన ఆమె, ఈ లేఖలో కొడుకుతో పాటు తండ్రి కూడా వేధింపులకు పాల్పడ్డారని రాసింది. ఈ లేఖను మార్చి 19, 2013న రాసినట్టు ఉండగా, దీని కాపీ సంపాదించిన, ఆసియన్ నెట్ న్యూస్ చానల్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. తాను ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చానని ఈ లేఖలో ఆమె తెలిపారు. దీనిపై ఆమె స్పందన కోరగా, "అది నేను రాసినదే. గతంలో పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. రాసినదంతా వాస్తవమే" అన్నారు. ఇదే విషయమై చాందీ స్పందిస్తూ, ఎన్నికల వేళ, తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువర్గం చేస్తున్న తుది ప్రయత్నమే ఇదని అన్నారు. ఇలాంటి ఆరోపణలను పట్టించుకోబోనని తెలిపారు.