: పవన్ కల్యాణ్ నుంచి ఆహ్వానం అందినా వెళ్లను: ఎమ్మెల్యే రోజా
పవన్ కల్యాణ్ నుంచి ఆహ్వానం వచ్చినా తాను 'జనసేన' పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రోజా అన్నారు. ‘జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఆహ్వానం అందితే ఆ పార్టీలోకి వెళతారా?’ అన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. తానెప్పుడూ పార్టీ, అధికారం, డబ్బు అనే వాటిని పట్టించుకోలేదన్నారు. ‘2019 లో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. బీజేపీ గానీ, చంద్రబాబునాయుడు గానీ తప్పు చేసినప్పుడు నిలదీస్తానని నాడు ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని, పలు అంశాలపై నోరుమెదపడం లేదని రోజా విమర్శించారు.