: ఎవరినీ వదిలేది లేదు: వంగవీటి రాధా
మచిలీపట్నంలో తన తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టబోమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాధా రాకతో నిజాంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం రాధా మాట్లాడుతూ, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహం ధ్వంసం జరుగుతుంటే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం నిందితులను పట్టుకోకుంటే తన స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మచిలీపట్నంలో కాపు సంఘం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.