: భారత గూఢచారి అరెస్టు అవాస్తవం... బెలూచిస్తాన్ లో పాక్ ఆగడాలను ఇండియా అడ్డుకోవాలంటున్న మహిళా సంఘం


బెలూచిస్థాన్ ప్రాంతంలో భారత 'రా' గూఢచారిని అరెస్ట్ చేశామని పాకిస్థాన్ చెప్పుకోవడం పూర్తి అవాస్తవమని వరల్డ్ బాలోచ్ ఉమెన్స్ ఫోరం అధ్యక్షురాలు నైలా క్వాద్రి బాలోచ్ వ్యాఖ్యానించారు. బెలూచిస్థాన్ ప్రాంతంలో పాక్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఇండియా అడ్డుకోవాలని ఆమె కోరారు. ఇక్కడి ప్రజలపై పాక్ నరమేధానికి పాల్పడుతోందని, దీన్ని అరికట్టే దిశగా ఇండియా కల్పించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇండియా చేయాల్సిన పనిని చేయడం లేదని, బెలూచిస్థాన్ పాకిస్థాన్ లో భాగం కాదని, తమ ప్రాంతాన్ని పాక్ ఆక్రమించుకుందన్న విషయాన్ని గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. "ఇక్కడ 'రా' లేదా మరే ఇతర ఏజన్సీ వ్యక్తుల కార్యకలాపాలు సాగడం లేదు. వారు (ఇండియా) నిజంగా కల్పించుకుని ఉంటే, బంగ్లాదేశ్ మాదిరిగా ఎప్పుడో స్వాతంత్రాన్ని పొందేవాళ్లం" అని నైలా క్వాద్రి వ్యాఖ్యానించారు. కాగా, కులభూషణ్ యాదవ్ అనే 'రా' ఏజంట్ ను తాము అరెస్ట్ చేసినట్టు పాక్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News