: రాజకీయ స్థిరత్వమే ఇండియాకు అండ: మోదీ


అభివృద్ధి చెందిన దేశాలకన్నా మెరుగైన వృద్ధి గణాంకాలను ఇండియా నమోదు చేస్తున్నదంటే, అందుకు కారణం రాజకీయ స్థిరత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రియాద్ పర్యటనలో ఉన్న ఆయన మౌలికవసతుల దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లి, అక్కడి భారత కార్మికులతో కాసేపు మాట్లాడారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ "మీ సంతోషమే నాకు సంతోషం. మీరు ఆనందంగా లేకపోతే, ఆ బాధ నాకూ తెలుస్తుంది. ప్రపంచం కోరుకుంటున్న నైపుణ్యవంతులైన కార్మికులు ఇండియాలో ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోంది. కొన్నాళ్ల తరువాత మీ పనితనాన్ని ప్రపంచం చూస్తుంది. పనిలో మీరు చూపుతున్న క్రమశిక్షణను చూసి భారత్ గర్వపడుతోంది" అని అన్నారు. ఏ ఒక్కరికి కష్టం ఎదురైనా, సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదేశాంగ శాఖ, ఆ శాఖలోని అందరు అధికారులు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. విదేశాల్లో పనిచేస్తున్న వారి సౌకర్యార్థం భారత ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని వివరించారు. మై గవ్, నరేంద్ర మోదీ మొబైల్ యాప్ వంటి వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. తన ప్రసంగం అనంతరం కార్మికులతో కలిసి ఆయన భోజనం చేశారు.

  • Loading...

More Telugu News