: ఆధారాలు చూపడంలో భారత్ విఫలమైంది: పాకిస్థాన్
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ సంస్థల హస్తముందని తెలిపే ఆధారాలు చూపడంలో భారత్ విఫలమైందని పాకిస్థాన్ దర్యాప్తు బృందం పేర్కొంది. భారత్ నుంచి వెళ్లిన ఒక రోజు తరువాత దీనిపై పాక్ దర్యాప్తు అధికారులు అక్కడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో పఠాన్ కోట్ లోకి పాకిస్థాన్ దర్యాప్తు బృందాన్ని భారత అధికారులు ప్రధాన మార్గం గుండా కాకుండా, ఇరుకు మార్గం గుండా తీసుకెళ్లారని ఆరోపించారు. అక్కడ తమ పర్యటన కేవలం 55 నిమిషాలు సాగిందని వారు పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో తమ బృందం ఆధారాలు సేకరించలేకపోయిందని వారు వెల్లడించారు. బీఎస్ఎఫ్ నిర్లక్ష్యం కారణంగానే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఉగ్రదాడి చోటుచేసుకుందని పాక్ తన నివేదికలో తేల్చింది.