: రోజాకు మ‌రో అవ‌కాశం .. నోటీసులిచ్చిన అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరో తేదీన కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో నాలుగు సార్లు కమిటీ విచారణకు రోజా పలు కారణాలతో గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమెకు మ‌ళ్లీ నోటీసులు జారీ చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ నోటీసులు జారీ చేసినప్ప‌టికీ రోజా అనారోగ్యం కారణంగా కమిటీ ముందు హాజరు కాలేదు. తనకు మరో 15 రోజుల సమయం కావాలని ఆమె కొన్ని రోజుల క్రితం లేఖను పంపారు. గతంలో ఎన్నిసార్లు పిలిచినా ఆమె కమిటీ పిలుపును లెక్కచేయలేదనీ, కనుక ఆమె విన్నపాన్ని ఈసారి పరిగణనలోనికి తీసుకోవాల్సిన పనిలేదని అభిప్రాయపడింది. తాజాగా మ‌రో అవ‌కాశం ఇస్తూ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ రోజాకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News