: శనిసింగణాపూర్ ఆలయం వద్ద ఉద్రిక్తత... మహిళలను అడ్డుకున్న స్థానికులు


భూమాతా బ్రిగేడ్ కార్యకర్తల రాకతో శనిసింగణాపూర్ లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. బాంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శనిసింగణాపూర్ దేవాలయంలో ప్రవేశించేందుకు మహిళలు వచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు ప్రవేశించకూడదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భూమాతా బ్రిగేడ్ సభ్యులు దేవాలయంలోకి ప్రవేశించేందుకు ఉద్యుక్తులు కాగా, వారిని స్థానికులు తోసిపారేశారు. పోలీసుల్ని భారీగా మోహరించినప్పటికీ మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం విశేషం. వారిని అడ్డుకుంటున్న వారిలో ఎన్సీపీ నేతలు కూడా ఉండడం మరో విశేషం.

  • Loading...

More Telugu News