: ముంబై హైకోర్టు తీర్పుతో శని సింగణాపూర్‌ ఆల‌య ప్ర‌వేశానికి బ‌య‌లుదేరిన మ‌హిళ‌లు


అన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ముంబై హైకోర్టు ఇచ్చిన‌ సంచలన తీర్పుతో.. మహారాష్ట్రలోని ప్రసిద్ధ శని సింగణాపూర్‌లో ఆలయలోకి ప్ర‌వేశించ‌డానికి పెద్ద ఎత్తున మ‌హిళ‌లు క‌దిలారు. ఉద్య‌మ కారిణి తృప్తి దేశాయ్ నాయకత్వంలో మ‌హిళా సాధికార‌త ఉద్య‌మ‌కారులు, పెద్ద సంఖ్యలో మహిళలు ప్రదర్శనగా అక్కడికి చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా తృప్తి దేశాయ్ మాట్లాడుతూ.. ఇక‌ తమను ఎవరైనా అడ్డుకుంటారని తాను భావించడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ‌ తమను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కోర్టు ధిక్కార కేసు పెట్టేందుకు వెనుకాడబోమని చెప్పారు. న్యాయం కోసం, హక్కుల సాధన కోసం జరిగిన ఈ పోరాటంలో విజయం తమనే వరించిందని ఆమె అన్నారు. తాము శాంతియుతంగా మందిరంలోకి ప్ర‌వేశించి, శ‌ని దేవునికి పూజ‌లు జ‌రుపుకునేందుకు.. స్థానిక ప‌రిపాల‌న విభాగాన్ని, పోలీసుల‌ని త‌మ‌కు స‌హ‌కరించాల్సిందిగా మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర‌ ఫ‌డ్న‌విస్‌ ఆదేశాలివ్వాల‌ని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News