: ప్రత్యూష ఆత్మహత్య వార్త చూసి షాక్ అయ్యా: శిల్పా శెట్టి
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పేపర్లో ప్రత్యూష ఆత్మహత్య వార్త చూసి షాక్కు గురయ్యామని శిల్పా శెట్టి ట్వీట్ చేసింది. ప్రత్యూష ఆత్మహత్య బాలీవుడ్ ప్రముఖులను కలిచివేసేలా చేసింది. కరణ్ జోహార్, కుష్బు, నీతూ చంద్రా, అనుపమ్ ఖేర్, రిచా చద్దా ప్రత్యూష మృతిపట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. ముంబైలోని తన నివాసంలో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసిన స్థానికులు హుటాహుటీన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.